వాహనాల తనిఖీలో 10 లక్షల నగదు, 20 తులాల బంగారం,13 తులాలు వెండి స్వాధీనం...

On
వాహనాల తనిఖీలో 10 లక్షల నగదు, 20 తులాల బంగారం,13 తులాలు వెండి స్వాధీనం...

ఎన్నికల రిటర్నింగ్ (RO) అధికారికి అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ ఏ మన్మోహన్ అప్పగించారు..

 

IMG-20231014-WA1716
అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ ఎ. మన్మోహన్, ఎస్ఐలు, సిబ్బంది

అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున వాహనాల తనిఖీ  చేయడం ప్రారంబించడం జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే-65 రోడ్డుపై సంపూర్ణ హోటల్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో, సుమారుగా శనివారం ఉదయం 10:00 గంటల సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా స్విఫ్ట్ కారు నెంబర్ TS08EL8607 గల దానిలో  రూ. 1,00,000/- (ఒక లక్ష రూపాయలు నగదు) తీసుకు వెళ్తుండగా మహమ్మద్ మహమూద్ అలీ(48) తండ్రి: దావూద్ అలీ, నివాసం: మిర్యాలగూడ, నల్గొండ, వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 

శనివారం సాయంత్రం సుమారుగా 05:00 గంటల సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కియా కారు నెంబర్ TS05FL7777  గల దానిలో రూ. 1,95,000/- (ఒక లక్ష తొంబై అయిదు వేల రూపాయలు నగదు) తీసుకొని వెళ్తుండగా మహమ్మద్ జిలానీ తండ్రి: నవాబ్, నివాసం: ప్రభాత్ నగర్, యూసుఫ్ గూడ వాసి నుండి స్వాధీనం చేసుకున్నామని అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎ. మన్మోహన్ తెలిపారు.

*ముఖ్య సూచనలు..* 

Read More ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

శాశనసభ ఎన్నికల దృష్థ్యా ఒక వ్యక్తి యాభైవేల రూపాయలు కంటే ఎక్కువ నగదు కలిగి వున్నట్లు అయితే, కచ్చితంగా ఆధారాలు చూపించాలి. ఓటర్లను  ప్రభావితం చేసే కానుకలు (చీరలు, కుక్కర్లు, బంగారు, వెండి ఆభరణాలు, టోకెన్లు) మరే ఇతర వస్తువులను అక్రమంగా ఉన్న రూపాయలు కూడా ఎన్నికల నియమావళి కిందకే వస్తుంది. అలా చేసిన వారిపై చట్టపరమైన చర్య తీసుకొనడం జరుగుతుంది. పెండ్లీల అవసరాల కోసం నగదు, బంగారం విలువైన వస్తువులు తీసుకు వెళ్తే, దృవవీకరణ పత్రాలు, ఆదాయ వనరులకు సంబందించిన వివరాలు అందించాలి. బంగారు ఆభరణాలు వున్నట్లు అయితే జెవెల్లరి షాప్ బిల్, జీఎస్టీ  పేమెంట్ లాంటి దృవీకరణ తప్పని సరి. రిజిస్ట్రేసన్ చేయించుకున్నట్లయితే ఆ డాక్యుమెంట్ లోని వివరాలు తెదితో పాటుగా చూపించాలి. అంతకంటే ఎక్కువ నగదు దొరికితే సీజ్ అవుతుంది. స్వాధీన సొమ్మును క్లెయిమ్ చేసుకోడానికి ఎవ్వరూ తగిన పత్రాలతో ముందుకు రానట్లు అయితే అ నగదు లెక్కకు రని రూపాయలు, లెక్కచూడని రూపాయలుగా పరిగణించ బడుతుంది. ముందస్తు సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా వుంచడమే కాకుండా, అతీ వ్యక్తులకు తగిన గుర్తింపు కూడా ఇవ్వడం జరుగుతుంది. సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే తప్పుడు పోస్టులు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించ వద్దన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలు అయిన వాట్సప్, ఫేస్ బుక్, ట్విటర్, ఇన్  స్టగ్రామ్, తేలేగ్రమ్, యు ట్యూబు లాంటి వాటిని వేధికగా చేసుకొని తప్పుడు, విద్వేషకర పోస్టులు షేర్ చేసిన తగిన చర్యలు తీసుకుంటాము. వ్యక్తి గత దూషణకు దిగడం, వార్నింగ్ ఇవ్వడం చేయరాదు. అసబ్యాకరమైన చిత్రాలు, వీడియొలు, సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చెయ్య వద్దు అని అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ ఏ మన్మోహన్ వెల్లడించారు.

Read More అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం..

Views: 186

About The Author

Post Comment

Comment List

Latest News