బి ఆర్ ఎస్ పార్టీ సకల జన సంక్షేమ మేనిఫెస్టో
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో
ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడకముందు అనేక సమస్యలు ఉండేవని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి విద్యుత్తు, నీటి సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కాదని అన్నారు.
తెలంగాణ పరిస్థితి అనేక విషయాల్లో అగమ్యగోచరంగా ఉండేదని చెప్పారు.
గత ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను కూడా అమలు చేశామని అన్నారు.
దళిత బంధులాంటి పథకం దేశంలో ఎక్కడాలేదని అన్నారు. రైతు బంధు, రైతు బీమా ఇప్పుడు సంపూర్ణ మతసామరస్యం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి సహకరించిన ముస్లిం, క్రిస్టియన్ సోదరులను అభినందిస్తున్నానని చెప్పారు.
**మేనిఫెస్టోలోని అంశాలు*
తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి రైతు బీమా తరహా కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం.. కుటుంబానికి 5 లక్షల బీమా. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం. రేషన్ కార్డు ఉన్న అందరికీ సన్నబియ్యం . దీనికి తెలంగాణ అన్నపూర్ణ పథకంగా నామకరణ
దివ్యాంగులకు 6,000వేలు పెన్షన్
సౌభాగ్య లక్ష్మి పథకం పేరుతో అర్హులైన మహిళకు 600కే గ్యాస్ సిలిండర్
ఆసరా పింఛన్ 5 వేలకు పెంపు
రైతు బంధు పథకానికి దశలవారీగా పదివేల నుంచి 16,000 వేలు పెంపు
ఆరోగ్యశ్రీ పథకానికి 15 లక్షల పెంపు
93 లక్షల కుటుంబాలకు భీమా సౌకర్యం
అర్హులైన లబ్ధిదారులకు 400కే గ్యాస్ సిలిండర్
అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూల్స్
మ
హిళా సంఘాలకు బిల్డింగులు నిర్మిస్తా
ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు 600 గ్యాస్ సిలిండర్ఆర్హులైన పేద మహిళలకు నెలకు 3000 ఆసరాభృతి ప్రతి ఎకరాకు 12000 వేలు
Comment List