వనస్థలిపురంలో అగ్ని ప్రమాదం..
సుమారు 15 లక్షల విలువ గల సామాగ్రి అగ్నికి ఆహుతి..
On
రంగారెడ్డి జిల్లా,
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం గణేష్ టెంపుల్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేష్ టెంపుల్ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు రావడంతో క్రమంగా షాప్ మొత్తానికి మంటలు విస్తరించి అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ జలంధర్ రెడ్డి కి సమాచారం రావడంతో ఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే రెండు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అరిపేసిన ఫైర్ సిబ్బంది. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ జలంధర్ రెడ్డి తెలిపారు. షాపులో సుమారు 15 లక్షల విలువ గల సామాగ్రి ఉందని యజమాని తెలిపాడు.
Views: 17
Comment List