వలిగొండలో వాహనాల తనిఖీల్లో పట్టుబడిన భారీ నగదు
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పోలీసుల వాహన తనిఖీలో భాగంగా సోమవారం రోజున మధ్యాహ్నం భువనగిరి చిట్యాల హైవేపై వాహన తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగానే ఒక వ్యక్తి నుండి 3,01,650 రూపాయలను తన వాహనంలో
తీసుకువెళుచుండగా పోలీసులకు పట్టుబడినారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వ్యక్తి పట్టుబడిన డబ్బులకు సంబంధించిన పత్రాలు పోలీసులకు సమర్పించలేకపోయారు. దీనితో డబ్బును స్వాధీనపరచుకొని ఈ మొత్తాన్ని డీటీవో భువనగిరి ఆఫ్ ఆఫీస్ కి బదిలీ చేయడం జరిగింది. 50 వేలకు మించి డబ్బులు తీసుకెళ్లినట్లయితే దానికి సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుందని అని వలిగొండ ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలియజేశారు.
Views: 932
Tags:
Comment List