100 వ రోజుగడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని పాదయాత్ర చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ని అభినందించిన--- దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు
అలుపెరుగని ప్రయాణం చేస్తూ-- అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకొని- ప్రభుత్వ మొండి వైఖరిని ఎండ కడుతూ ప్రజా ఆశీర్వాదంతో ఈసారి శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని పాదయాత్ర చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ని అభినందించిన--- దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు నా అడుగుజాడల్లో నడుస్తాడు అభివృద్ధికి పాటుపడతాడు ముందుండి నడిపిస్తా ఈసారి రవికుమార్ యాదవ్ ని ఆశీర్వదించండి అసెంబ్లీకి పంపండి ---మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తలపెట్టిన గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప లో వందరోజుల సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు, శేర్లింగంపల్లి మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్స్, కంటెస్టెడ్ కార్పొరేటర్స్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మహిళా మోర్చా ,యువమోర్చా, వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథన్ రావు మాట్లాడుతూ యువకుడు ఉత్సాహవంతుడు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి ప్రజా పోరాటం చేస్తున్న రవికుమార్ యాదవ్ కి ఈసారి భారతీయ జనతా పార్టీ నుండి టికెట్ ఆశిస్తూ ముందు వరుసలో ఉన్నారు కావున మీరందరూ అతని గెలిపించి అసెంబ్లీ పంపించినట్లయితే ప్రజా సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తూ మీ మధ్యలో ఉంటాడు కావున అతని గెలిపించి మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేశారు. 10 సంవత్సరాలలో తొమ్మిది వేల కోటతో అభివృద్ధి చేశానని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే సరైన రోడ్లు ఉన్నాయా?సైరైన విద్యాలయాలు ఉన్నాయా?, సరిగ్గా మంచినీరు అందుతుందా?, ప్రజల ఆరోగ్యానికి భద్రత ఉందా? అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందాయా? నిరుద్యోగ భృతి సంగతేంటి? ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో కోకొల్లలు సమస్యలు పాదయాత్రలో తమ దృష్టికి వచ్చాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తెలిపారు, అంతేకాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేసి,భూకబ్జాలకు పాల్పడుతూ అక్రమాస్తులు సంపాదిస్తున్నారని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికలలో విజయం సాధించి తమ దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే దృష్టి సాధిస్తానని ఈ అక్రమార్కుల భరతం పట్టి ప్రజా రంజక పాలన అందిస్తారని ఓటర్లను కోరారు.
Comment List