
విశ్వ కారుణ్య మూర్తి ప్రవక్త ముహమ్మద్ అన్న అంశంపై కవి సమ్మేళనం
కవి సమ్మేళనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
ధార్మిక సాహిత్య వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో విశ్వ కారుణ్య మూర్తి ప్రవక్త ముహమ్మద్ అన్న అంశంపై కవి సమ్మేళనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.ప్రముఖ సాహితీ వేత్త ముహమ్మద్ అబ్దుల్ రషీద్ నిర్వాహణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కవులు ప్రవక్త గురించి సందేశాత్మక కవితలు, అతిథులు వారి యొక్క సందేశాన్ని అందరితో పంచుకున్నారు. ప్రముఖ కవి రవీంద్రబాబు అరవా తను వ్రాసిన కవితను చదివి ప్రముఖుల మన్ననలు పొందారు. ప్రతి ఒక్కరూ అభినందించారు. ముఖ్యంగా నాలేశ్వరం శంకరం తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు,మోటూరి నారాయణ రావు జర్నలిస్ట్ అభినందించారు. అటు తర్వాత చక్కని మేమొంటో, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరించారు. శీర్షిక:- అందరివాడు ప్రవక్త ఇస్లాం అంటేనే శాంతి మనిషిని మనిషిగా చూసే క్రాంతి తొలగించారు మూడాచారాల బ్రాంతి అందరి హృదయాలలో చోటు సంపాదించిన మూర్తి నిరాయుధులకు రక్షణ కల్గించటం ఇస్లామీయ యుద్ద నియమాలలో ముఖ్యం యుద్ద ఖైదీలకు రక్షణ కల్పించటం వివాదాలకు శాంతియుత పరిష్కారం అంతర్జాతీయ న్యాయ సూత్రాల్లో ప్రవక్త బోధనల ప్రభావం హుదైబియా ఒప్పందం ప్రవక్త సాధించిన గొప్ప విజయం అల్ అహద్ అనేది ఇస్లామీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో ముఖ్యాంశం రాయబారులకు రక్షణ కల్పించే నియమాలు ఖచ్చితం హదీసులో ప్రవక్త చెప్పిన మాటలు గమనార్హం ప్రతీ మతంలో ఉంది సంఘర్షణం మంచిని తీసుకుంటే మిగులుతుంది మానవత్వం మత మౌఢ్యం పెరిగితే ఏలుతుంది అరాచకం ఆయుధాలు పెట్టవు ఆహారం అణ్వస్త్రాలతో నిలువరించదు ఏ సమాజం అందరిలోనూ ప్రజ్వరిల్లాలి సమానత్వం అప్పుడే జరుగుతుంది శాంతి స్థాపనం సర్వ మానవాళికి వీరి బోధనలు అనుసరణీయం ఆచరణీయం..
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List