ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించండి నీలం మధు ముదిరాజ్

నియోజకవర్గ రూపురేఖలు మార్చుకుందాం..

On
ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించండి నీలం మధు ముదిరాజ్

గుమ్మడిదల మండల కేంద్రంలో రెండో రోజు కొనసాగిన పాదయాత్ర..తొమ్మిదేళ్ల పాలనలో పటాన్ చెరు నియోజకవర్గానికి ఈ నవరత్నాలు గుర్తుకు రాలేదా, ఇప్పుడు నవరత్నాలు మేనిఫెస్టో పేరుతో కొత్త డ్రామా షురూ చేశావని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ ప్రశ్నించారు.రెండవ రోజు "మీ కొడుకు మీ గుమ్మంలో" పాదయాత్రలో భాగంగా గుమ్మడిదల మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు నీలం మధు ముదిరాజ్ కు ఘన స్వాగతం పలికి తమ బిడ్డలా ఆదరించారు. తమ గ్రామాలలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను నీలం మధు దృష్ఠికి తీసుకుని వచ్చారు. పాదయాత్రలో భాగంగా నీలం మధు ముదిరాజ్ ఉదయం గుమ్మడిదలలో గ్రామస్తులు తన అనుచరులు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులతో కలిసి అల్పాహారం చేస్తూ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మన ఆత్మగౌరవం కోసం చేస్తున్న ఈ పోరాటంలో మన కుటుంబ అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మన అభివృద్ధిని మనమే నిర్వహించుకుందామని భరోసా ఇచ్చారు. అIMG-20231017-WA0119నంతరం పాదయాత్రలో స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు పటాన్ చెరు ఎమ్మెల్యేగా పని చేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేంటో చెప్పాలన్నారు. గత పదేండ్లుగా చెయ్యని పనులను ఇప్పుడు చేస్తానని నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. తాము ప్రవేశపెట్టిన ప్రజా మేనిఫెస్టో లోని ఐదు అంశాలతో తన సీటు గల్లంతయితుందని వణికిపోయి అప్పటికప్పుడు నవరత్నాలు ప్రకటించాడని విమర్శించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓట్ల కోసం ఎన్ని బూటకపు మాటలు చెప్పిన మభ్యపెట్టిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వివరించారు. తొమ్మిదేళ్లగా పదవి అహంకారంతో క్రింది స్థాయి నాయకులను ప్రజలను అవమానించిన తీరును నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలెవ్వరు మర్చిపోలేదని, ఈ ఎన్నికల్లో నీకు సరైన గుణపాఠం చెప్పి నిన్ను ఇంటికె పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు స్పష్టంగా ఆత్మ గౌరవ పోరాటానికి అండగా నిలబడి వారి ఇంట్లో బిడ్డనైన నీలం మధును ఎమ్మెల్యేగా గెలిపించడానికి డిసైడ్ అయ్యారని ధీమా వ్యక్తం చేశారు.మా ఆత్మగౌరవ పోరాటానికి మద్దతుగా చేపట్టిన పాదయాత్రకు సర్వ మతాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, ప్రజలంతా స్వచ్ఛందంగా తనకు మద్దతిస్తూ గడపగడప లో నన్ను తమ కన్నబిడ్డగా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆత్మగౌరవ పోరాటంలో ప్రజలంతా తన పక్షాన నిలబడి ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ ఇంట్లో బిడ్డగా మీ ముందుకు వస్తున్న మీ నీలం మధు మీ ఆశీర్వాదంతో గెలుపొందిన వెంటనే మన అభివృద్ధి మనమే చేసుకుందామని నియోజకవర్గ రూపురేఖల్ని పూర్తిగా మార్చుకొని ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 345

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*