ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే కేపీ నాగార్జున
ప్రజా సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే కేపీ నాగర్జున రెడ్డి గారు అన్నారు. శనివారం పొదిలి మండలం పరిధిలోని ఉప్పలపాడు సచివాలయం పరిధిలోనీ 227 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ నాగర్జున రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు హారతులతో ఎమ్మెల్యే కేపీ కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ పలు వీధుల్లోని ప్రతి గడప - గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి నాలుగున్నర సంవత్సరాల పాలనలో అందించిన సంక్షేమ బుక్ లను అందించి ప్రభుత్వ పథకాల లబ్ది గురించి వివరించడం జరిగింది. అనంతరం ఆయా వీధుల్లో స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఎంపీపీ, జెడ్పిటిసి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List