
పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం
కార్యక్రమం లో పాల్గొన్న ఆరు మండలాల ఎస్సై లు
గిద్దలూరు న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని డిఎస్పి వీర రాఘవరెడ్డి, సీఐ దేవ ప్రభాకర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరంలో గిద్దలూరు,కంభం సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. అలానే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానాన్ని చేశారు. రక్తదానంపై అపోహలు వీడి ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయాలని డిఎస్పి వీర రాఘవరెడ్డి రక్తదాతలకు విజ్ఞప్తి చేశారు. అలానే విధి నిర్వహణలో అంకిత భావం ప్రదర్శిస్తూ అసువులు బాసిన పోలీసులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన పోలీసు సిబ్బందిని ప్రజలను డిఎస్పి వీర రాఘవరెడ్డి అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో గిద్దలూరు ఎస్సైలు మహేష్, అజితారావు,కొమరోలు ఎస్ఐ సుబ్బరాజు,రాచర్ల ఎస్సై కృష్ణ పావని,బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు, కంభం ఎస్సై పులి రాజేష్, అర్ధవీడు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List