ఆచార్య వస్తున్నాడు..
coming soon acharya-chiru: “ఆచార్య” సినిమాతో తమ అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వం వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న “ఆచార్య” టీం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ […]
coming soon acharya-chiru: “ఆచార్య” సినిమాతో తమ అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వం వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది.
ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న “ఆచార్య” టీం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తాజాగా ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ… తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేస్తానంటూ అధికారికంగా ప్రకటించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
మెగా ఫ్యాన్స్ ఎంతకాలం నుంచో ఈ కాంబోను వెండితెరపై వీక్షించాలను కోరుకుంటున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి చేయనున్న ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు ఇప్పటికే జరిగాయని, కొన్ని కాన్సెప్ట్ లు కూడా రెడీగా ఉన్నాయని, ఇక ఈ భారీ ఆ మల్టీస్టారర్ సినిమాను స్వయంగా తానే నిర్మిస్తానని చరణ్ కన్ఫర్మ్ చేశాడు. ఓవైపు “ఆచార్య”తో తండ్రితో, మరోవైపు బాబాయ్ తో కూడా చెర్రీ స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి బాబాయ్, అబ్బాయ్ కలిసి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List