గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తే….గృహ లక్ష్మీకి అనర్హులా…?

న్యూస్ ఇండియా తెలుగు, అశ్వారావుపేట నియోజకవర్గం, సెప్టెంబర్ 23, 2023

On
గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తే….గృహ లక్ష్మీకి అనర్హులా…?

మా ఓట్లతో గెలుస్తారు గెలిచాక అంతా తారుమారు సాక్షాత్తు ఎమ్మెల్యే సందర్శించి ఇల్లు కట్టిస్తాం అన్న జరగని పని స్థానిక అధికార పార్టీ నాయకులను అడిగితే మాపై హేళనగా మాట్లాడుతున్నారు- పెంచికలపాడు గ్రామస్తులు

బంగారు తెలంగాణా రాకతో చీకట్లలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మా గిరిజన బ్రతుకులు మారతాయని ఆశపడ్డాం. కానీ అంతా మాములే ఎప్పటిలానే మా గూడెం బ్రతుకులు మారలేదు.గెలిస్తే ఇళ్ళు ఇస్తాం. రోడ్లు ఇస్తాం మీ బ్రతుకులు మార్చేస్తాం అంటూ మాయ మాటలు చెప్పి మా ఓట్లతో అధికారంలోకి వచ్చారు,కానీ గెలిచాక అంతా తారుమారైపోయింది కనీసం మా వైపు చూసిన నాయకుడే లేకుండా పోయారు మళ్ళీ ఏమోహం పెట్టుకొని ఓట్లు అడుగుతారో మేము చూస్తాం సారు అంటూ తమ బాధను వెళ్లగక్కారు అశ్వారావుపేట మండలం నారాయణపురం పంచాయితీ పెంచికలపాడు గ్రామస్థులు ఈ గ్రామంలో ఉన్న ముప్పై ఇళ్ళు….. పురిగుడిసెలే అవికూడా రేపో మాపో పడిపోయేలా ఉన్నాయి,వర్షం వస్తే మురికి నీరంతా ఇళ్ళ లొనే.. ఇప్పటికి డ్రైనేజీ వ్యవస్థ లేని గిరిజన ప్రాంతం మురికి నీటి నిల్వలతో దోమల జ్వరాల బారిన గ్రామస్థులు, పట్టించుకునే నాయకుడే లేకుండా పోయారు,సాక్ష్యత్తు అశ్వారావుపేట ఎమ్మెల్యే ఒకసారి తమ గ్రామాన్ని సందర్శించినప్పుడు మా కూలిపోయే గుడిసెలు చూపించాం దంతో ఇంకేముంది ఇళ్ళన్ని పీకేసి పక్క ఇళ్ళు కట్టిస్తానని మాట ఇచ్చారు కానీ మళ్ళీ పట్టించుకోలేదు,మరోసారి స్థానిక అధికార పార్టీ నాయకులకు సర్పంచ్,జెడ్పిటిసి, లకు మా బ్రతుకి పరిస్థితి చెప్తే నారాయణపురం సొసైటీ ఛైర్మెన్ మమ్మల్ని హేళనచేస్తు ఊరికే వేశారా మాకు ఓట్లు ఇళ్ళు కావాల మీకు,పొడుభూమి పట్టాలు ఇస్తే ఇళ్ళు రావు మీకు….., మళ్ళీ పక్క ఇళ్ళు కావాలా…. ? మీకు ఇళ్ళు ఇవ్వడం కుదరదని చెప్పారని గ్రామస్థులు వాపోయారు మళ్ళీ ఏమోహం పెట్టుకొని మా ఓట్లకోసం ఎలా వస్తారో చూస్తామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మా గిరిజన ప్రాంతాల్లో పంచాయితీ పారిశుధ్యం నిద్ర పోతోందని కనీసం మా గిరిజన ప్రాంతానికి చెత్త సేకరించే ట్రాక్టర్ కూడా రాదని ఊరిలో చెత్త అంత మేమె ఎక్కడికక్కడ కాల్చేస్తున్న పరిస్థితి ఉందని తెలియజేసారు.

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక