ఆరు నూరైనా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం..
ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్
On
ఆరు నూరైనా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం -మధుయాష్కీ గౌడ్..
ఎల్బీనగర్,
నవంబర్ 14 (న్యూస్ ఇండియా తెలుగు): కొత్తపేట డివిజన్ లో మధు యాష్కీ గౌడ్ పాదయాత్ర రాజీవ్ గాంధీ నగర్ మసీదు నుండి శ్రీనివాస కాలనీ, ఆర్టీసీ కాలనీ మీదుగా శివాలయం వద్ద ముగిసింది. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ మాట్లాడుతూ, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి, పార్టీ మారిన దొంగను, ఫిరాయింపు దారుడిని ఓడగొట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు. ఈ పాదయాత్రకు అతిథిగా ఏఐసిసి అధికార ప్రతినిధి షమా మహమ్మద్ హాజరయ్యారు. వారు గడప గడపకు తిరుగుతూ, మహిళలకు 2500 పెన్షన్, ఉచిత బస్ సౌకర్యం, గృహ జ్యోతి కింద 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని తెలిపారు.
Views: 7
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Nov 2025 18:25:39
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...

Comment List