కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ కు ఋణపడి ఉంది: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీగౌడ్..

కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటా..

On
కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ కు ఋణపడి ఉంది: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీగౌడ్..

కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ కు ఋణపడి ఉంది: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీగౌడ్..

కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటా..

IMG-20231118-WA0057
మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాస్కి గౌడ్

ఎల్బీనగర్, నవంబర్ 18 (న్యూస్ ఇండియా తెలుగు): శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట డివిజన్లో లింగాల కిషోర్ ఆధ్వర్యంలో శివగంగ కాలనీ, శ్రీనివాస కాలనీ వాసులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ హాజరయ్యారు. అనంతరం కాలనీవాసులు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించి వారి సమస్యలని పరిష్కరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ గడ్డ కాంగ్రెస్ అడ్డ, ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విజయాలు అందించిన ఎల్బీనగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంది. తల్లి లాంటి పార్టీని మోసం చేసి అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకు సుధీర్ రెడ్డి పార్టీ మారాడు. కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడంతో పాటు ఫిరాయింపుదారుడికి బుద్ధి చెప్పే బాధ్యత అధిష్టానం నాపై ఉంచింది. మీ ఆశీర్వాదంతో గెలిచి నియోజకవర్గానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ, ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా మీ పిల్లల భవిష్యత్తుకు విదేశీ విద్య ద్వారా, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల ద్వారా సొంత ఖర్చులతో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు. లోకల్ నాన్ లోకల్ అనే తేడా లేకుండా సబ్బండ వర్గాల, సంయుక్త అభివృద్ధికి కృషి చేస్తానని మాటిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా కర్ణాటక మంత్రి మధు బంగారప్ప హాజరయ్యారు. వీరితోపాటు ప్రచార కమిటీ కో కన్వీనర్ వజీర్ ప్రకాష్ గౌడ్, పుష్పలత, చిన్న గౌడ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు