గోపరాజు పల్లి లో ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణాలు

ప్రజల సమస్యలు తీర్చే వారికే ఓటేస్తామన్న గ్రామస్తులు

గోపరాజు పల్లి లో ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణాలు

IMG-20231120-WA0521
గోపరాజుపల్లిలో సిపిఎం నాయకుల ప్రచారం

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండమండలంలోని గోపరాజుపల్లి గ్రామంలో రోజురోజుకు రాజకీయాలు తారుమారు అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎదురే లేదని చెప్పినా బిఆర్ఎస్, కాదు మేమే ముందున్నాం అంటూ చెప్పిన కాంగ్రెస్ సోమవారం నాటికి సిపిఎం పార్టీ రంగంలోకి దూసుకు రావడంతో త్రిముఖ పోటీ ఉండటం విశేషం. సోమవారం భువనగిరి నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి కొండమడుగు నరసింహ ప్రచారం గ్రామంలో జోరుగా సాగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ పేదల పక్షాన కొట్లాడేది ఒక సిపిఎం పార్టీ మాత్రమేనని అందుకే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీ బలపరిచిన కొండమడుగు నరసింహ ఎమ్మెల్యే అభ్యర్థి సుత్తి కొడవలి సుక్క గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నరసింహ సిపిఎం మండల కార్యదర్శి సిరిపంగి స్వామి మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు మద్దెల రాజయ్య. గ్రామ శాఖ కార్యదర్శి ఎనుగుల నరసింహ తదితరులు పాల్గొన్నారు

Views: 159

Post Comment

Comment List

Latest News

అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం. అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : నమ్మదగిన సమాచారం మేరకు తేది: 08.05.2025 నాడు ఉదయం అందాజ 11:00 గంటల సమయంలో...
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.