గోపరాజు పల్లి లో ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణాలు

ప్రజల సమస్యలు తీర్చే వారికే ఓటేస్తామన్న గ్రామస్తులు

గోపరాజు పల్లి లో ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణాలు

IMG-20231120-WA0521
గోపరాజుపల్లిలో సిపిఎం నాయకుల ప్రచారం

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండమండలంలోని గోపరాజుపల్లి గ్రామంలో రోజురోజుకు రాజకీయాలు తారుమారు అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎదురే లేదని చెప్పినా బిఆర్ఎస్, కాదు మేమే ముందున్నాం అంటూ చెప్పిన కాంగ్రెస్ సోమవారం నాటికి సిపిఎం పార్టీ రంగంలోకి దూసుకు రావడంతో త్రిముఖ పోటీ ఉండటం విశేషం. సోమవారం భువనగిరి నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి కొండమడుగు నరసింహ ప్రచారం గ్రామంలో జోరుగా సాగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ పేదల పక్షాన కొట్లాడేది ఒక సిపిఎం పార్టీ మాత్రమేనని అందుకే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీ బలపరిచిన కొండమడుగు నరసింహ ఎమ్మెల్యే అభ్యర్థి సుత్తి కొడవలి సుక్క గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నరసింహ సిపిఎం మండల కార్యదర్శి సిరిపంగి స్వామి మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు మద్దెల రాజయ్య. గ్రామ శాఖ కార్యదర్శి ఎనుగుల నరసింహ తదితరులు పాల్గొన్నారు

Views: 147

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు