వాడవాడలా బిజెపికి బ్రహ్మరథం.. 

ఇబ్రహీంపట్నం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్..

On
వాడవాడలా బిజెపికి బ్రహ్మరథం.. 

మంచిరెడ్డి కాదు ముంచేరెడ్డి.. మల్'రెడ్డి ది ముగిసిన చరిత్ర..

ఇబ్రహీంపట్నం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్..

IMG_20231120_231817
తట్టిఅన్నారంలో ప్రచారం నిర్వహించిన ఇబ్రహీంపట్నం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్..

వాడవాడలా బిజెపికి బ్రహ్మరథం.. 

దయానంద్ గౌడ్ గెలుపు ఖాయమే.. సాధు శ్రీనివాస్

Read More ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

ఇబ్రహీంపట్నం, నవంబర్ 20 (న్యూస్ ఇండియా తెలుగు): ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ పెద్దఅంబర్పెట్ మునిసిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దయానంద్ గౌడ్ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లక్రితం మల్ రెడ్డి రంగారెడ్డి ని చూసిన వాళ్లేవారు కాంగ్రెస్ కి ఓటు వేయరని, మల్ రెడ్డి రంగారెడ్డిది ఇబ్రహీంపట్నంలో ముగిన చరిత్ర అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఏజెంట్లు ఉన్నారని, సగం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని అన్నారు. కిషన్ రెడ్డి ఇంటిపేరు మాత్రమే మంచిరెడ్డి అని, అతను ముంచేరెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే వందల ఎకరాల భూములు కబ్జాపెట్టాడని అన్నారు.  ఇటువంటి నేతలను మళ్ళీ మనం ఎన్నుకుంటే ఇబ్రహీంపట్నం మరో శతాబ్దకాలం వెనక్కి వెళ్తుందని అన్నారు. మోడీ సంక్షేమ పాలన మన రాష్ట్రంలో కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడాలని దానికోసం మనం బిజెపికి ఓటువేసి బారి మెజారిటీతో బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పెద్ద అంబర్పెట్ మునిసిపాలిటీ అధ్యక్షులు సాధు  శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడ కనీసం డ్రైనేజీ ఔట్ లెట్ లేదు, ఐదేళ్ల కింద ఎన్నికల సమయంలో చేస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటికీ దిక్కులేదు. మళ్ళీ అదే హామీతో మళ్ళీ ఓట్లకోసం వస్తున్నారు బీఆరెస్ నేతలు. చేస్తామని హామీ ఇచ్చిన మంచిరెడ్డి ఇప్పటికి పత్తా లేడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బోసుపల్లి ప్రతాప్, ఎన్. యాదగిరి రెడ్డి, అర్జున్ రెడ్డి, అంజయ్య యాదవ్, తట్టి అన్నారం కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా స్పోక్స్ పర్సన్ బాల్ రెడ్డి, కార్యదర్శి ఘంటా ప్రభాకర్ రెడ్డి, షకీల్ మీర్జా, రాజిరెడ్డి, మధు గౌడ్, జగదీశ్ గౌడ్, పిల్లి శ్రీనివాస్ యాదవ్, సురుకంటి రామ్ రెడ్డి, తల్లోజు కృష్ణమాచారి, పాండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 27

About The Author

Post Comment

Comment List

Latest News