హారతులు ఇస్తూ డప్పు లతో స్వాగతం
కాంగ్రెస్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమావుతుంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా // అశ్వారావుపేట // అశ్వరావుపేట నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేట మండలం లోని శుద్ధగోతులు గూడెం,రెడ్డిగూడెం,తిరుమలకుంట కాలనీ, తిరుమలకుంట,మామిళ్ళవారిగూడెం, నారాయణపురం, తదితర గ్రామాలు కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ ఉరురు తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు,గ్రామ పొలిమేరల్లో మహిళలు,గ్రామస్తులు జారే ఆదినారాయణకి ఎదురొచ్చి హారతులు ఇస్తూ డప్పు లతో స్వాగతం పలికారు, చిన్న పెద్ద, ధనిక పేదా అని తేడా లేకుండా అందరినీ పలకరిస్తూ, కాంగ్రెస్ను గెలిపించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఒకసారి అవకాశం,ఇవ్వాలి, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదని విమర్శలు గుప్పించారు, ఈ శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అని కాంగ్రెస్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమావుతుందని తెలిపారు, కాంగ్రెస్ గెలిపించుకోవాలని కోరారు, ప్రచార కార్యక్రమంలో భాగంగా, పాట పాడి కార్యకర్తలను నాయకులను మహిళలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జారి ఆదినారాయణ తో పాటు వివిధ పంచాయతీల సర్పంచులు,ఎంపీటీసీలు,పార్టీ కార్యకర్తలు,అభిమానులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comment List