*దొరల గడీల పాలన అంతం చేసి రాజ్యాధికారం అందిస్తాం*

*దొరల గడీల పాలన అంతం చేసి రాజ్యాధికారం అందిస్తాం*

IMG-20231126-WA0039

 *దంతాలపల్లి* :-దొరల గడీల పాలన అంతం చేసి బహుజనులకు రాజ్యాధికారం అందిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూగుల్ పార్వతి రమేష్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ దంతాలపల్లి మండలంలోని నిదానపురం,ఆగపేట,రామవరం తూర్పు తండా,గున్నేపల్లి,దంతాలపల్లిగ్రామాల్లో బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి గుగులోతు పార్వతి రమేష్ నాయక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీ నాయక్ మాట్లాడుతూ దంతాలపల్లి మండలంలో దొరల గడీల పాలనకు  బహుజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బహుజనులకు రాజ్యాధికారం వస్తే దొరలు అక్రమంగా సంపాదించిన సంపదను  కులాల వారిగా జనాభా ప్రతిపాదికన అందరికీ పంచుతామని అన్నారు.బహుజన రాజ్యాధికారం కోసం ఏను గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి అవకాశం ఇస్తే,డోర్నకల్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని కోరారు.ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా కార్యదర్శి డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరుశురాములు, జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను, అసెంబ్లీ అధ్యక్షులు బాష్పంగు మహేందర్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ జినక సువార్త,నియోజకవర్గ నాయకులు తగరం శ్రీరామ్,మరిపెడ మండల అధ్యక్షులు జినక కృష్ణమూర్తి,చిన్నగూడూరు మండల ప్రధాన కార్యదర్శి జాగటి సునీల్, చిన్న గూడూరు మండల మహిళ కన్వీనర్ వంగూరి స్వరూప, నాయకులు గుగులోత్ రామారావు, పోలేపాక ప్రవీణ్,భూక్యా చందు నాయక్, వంకుడోత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 32
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News