నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడెం ఏరియా జిఎం
ప్రభుత్వ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడెం ఏరియా జిఎం
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )జనవరి 2: కొత్తగూడెం ఏరియా జిఎం ఎం షాలేo రాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల ను జాయింట్ కలెక్టర్ పి.రాంబాబు,భీమా నాయక్, సీసీఫ్ (చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్), కృష్ణ గౌడ్ డీఎఫ్ఓ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పుష్ప గుచ్చం తో సన్మానించారు. ఈ సందర్భముగా కొత్తగూడెం ఏరియా జిఎం, కొత్తగూడెం ఏరియాలోని బొగ్గు ఉత్పత్తి, డిస్పాచ్, ఎన్విరాన్మెంట్ మరియు సేఫ్టీ గురించి వివరించి నూతన వి.కే ఓ సి ఉపరితల గని ప్రారంభం గురించి చర్చించారు.ఈ కార్యక్రమములో ఎస్ ఓ టు జిఎం జీవీ కోటిరెడ్డి, సీనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ తౌర్య నాయక్ లు పాల్గొన్నారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List