పాయకరావుపేటలో కంబాల జోగులుకు చెక్
మళ్లీ అభ్యర్ధిని మార్చే వ్యూహంలో వైసీపీ!
పాయకరావుపేటలో స్థానిక మహిళానేతకు ఇచ్చే ఛాన్స్
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముందుకొస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు హోరాహోరీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నేపథ్యంలో అభ్యర్ధులను మారుస్తున్న వైసీపీ.. కొన్ని చోట్ల మాత్రం వేరే జిల్లా నేతల్ని తీసుకువచ్చి ఇంఛార్జి బాధ్యతలు ఇవ్వడం స్థానిక నేతలకు రుచించడం లేదు. దీంతో వలస నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్ధుల్ని మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును మార్చి.. ఆయన ప్లేస్ లో శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగ8లుకు ఇంచార్జి బాధ్యతలు ఇచ్చారు. అయితే కంబాల జోగులకు పేట నియోజకవర్గ నాయకులు ఎశరూ సహకరించండం లేదు. దీనికి తోడు ఇప్పటికే మూడు గ్రూపులుగా ఉన్న నాయకత్వం.. అటు జోగులకు తల నొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో సరికొత్త సర్వేలు చేయించిన పార్టీ.. కంబాల జోగులకు ప్లేస్ లో స్థానికులకే టికెట్ కేటాయించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటి వారంలో టికెట్ కేటాయించే చాన్స్ ఉంది. మహిళా నేతకు స్థానికంగా ఉన్న పట్టు నేపథ్యంలో.. ఆమెకు టికెట్ ఇస్తే గెలుపు సులువు అవుతుందనే టాక్ నడుస్తోంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List