న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక క్యాలెండ్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి
(నారాయణఖేడ్,జనవరి23న్యూస్ ఇండియా)
నిజాలను నిర్భయంగా రాసే ఏకైక పత్రిక న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక అని ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.న్యూస్ ఇండియా పత్రిక అన్ని రంగాలలో తనదైన శైలిలో వార్త కథనాలను అందిస్తోందన్నారు.ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలోను, అదేవిధంగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చిరవేయడంలోను విన్నూత పద్ధతులలో ఆలోచించటం న్యూస్ ఇండియా కే చెందుతుంది అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ పత్రిక రంగంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున ఏకైక పత్రిక న్యూస్ ఇండియా అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యూస్ ఇండియా కంగ్టి రిపోర్ట్,కార్యకర్తలు, అనిల్ శ్రీమాన్, నాగప్ప, తదితరులు పాలొగొన్నారు.
Comment List