కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్

On

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ -టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ -రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కు పంపిణి చేసిన ఎమ్మెల్యే రవీంద్ర పార్టీ కోసం పని చేసే వారికీ టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలంలోని గిరిజనగర్ తండాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నేనావత్ సిత్య ఇటీవల మృతి చెందాడు.సిత్య టీఆర్ఎస్ ప్రమాద బీమాలో […]

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
-టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
-రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కు పంపిణి చేసిన ఎమ్మెల్యే రవీంద్ర
పార్టీ కోసం పని చేసే వారికీ టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలంలోని గిరిజనగర్ తండాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నేనావత్ సిత్య ఇటీవల మృతి చెందాడు.సిత్య టీఆర్ఎస్ ప్రమాద బీమాలో సభ్యత్వం పొందడంతో బీమా పథకం కింద మంజూరైన రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మృతుడి బార్య చక్రి కు అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ….గ్రామా స్థాయి నుంచి పార్టీ ని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు.టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా పథకం లో సభ్యత్వం తీసుకోవాలని ఆయన అన్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలనీ సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ,ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్,రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు TVN రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్,టిఆర్ఎస్,పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు,బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,వాడిత్య దేవేందర్,పొన్నబోయిన సైదులు,ముక్కమల్ల బాలయ్య,నేనావత్ వశ్య నాయక్,నేనావత్ కళ్యాణ్,అరేకంటి రాములు,పాషా,బైరెడ్డి కొండల్ రెడ్డి,బోడ్డుపల్లి కృష్ణ,గంగలి పర్వతాలు, తదితరులు పాల్గొన్నారు

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News