ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన మేకల కాపరి
రుద్రంగి, జనవరి30,న్యూస్ ఇండియా ప్రతినిధి
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండరెంజల్ గ్రామానికి చెందిన బాగయ్య (24) అనే మేకల కాపరి ప్రమాదవశత్తు బావిలో పడి మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం గైదిగుట్ట అడ్డబోర్ తాండల సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిసిన వివరాల ప్రకారం..
రుద్రంగి మండలం గైదిగుట్ట అడ్డబోర్ తండా సమీపంలో మంగళవారం ఉదయం బాగయ్య మేకలను తీసుకొని మేపడానికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చెయ్యడానికి తాగడానికి నీళ్లు లేకపోవడంతో తన మిత్రుడి కి నీళ్లు తీసుకువస్తా అని బాగయ్య సమీప దగ్గరలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు. నీళ్లకోసం వెళ్లిన బాగయ్య ప్రమాదవశాత్తు బావిలో పడిపోగా బాగయ్య రాకపోయే సరికి బావి దగ్గరకి తన మిత్రుడు బావి దగ్గరికి వెళ్లే సరికి బావి వద్ద చెప్పులు, గొంగడి ఉన్నట్టు గుర్తించాడు. ఈ విషయం వెంటనే దగ్గరలో ఉన్న స్థానికులకు చేరవేయగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి బంధువులకు సమాచారం అందించి పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్లకు తరలించినట్టు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List