గావ్ ఛలో -భస్తీ ఛలో అభియాన్ లో పాల్గొనాలి.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు, పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్
గావ్ ఛలో -భస్తీ ఛలో అభియాన్ లో పాల్గొనాలి.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడానికి, నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడానికి బీజేపీ శ్రేణులు పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, బస్తీల్లో పర్యటించి నరేంద్ర మోడీ పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అవగాహన కల్పించి ప్రజలను బీజేపీ వైపు ఆకర్షితులయ్యే విధంగా బీజేపీ శ్రేణులు గావ్ ఛలో -బస్తీ ఛలో అభియాన్ లో పాల్గొనాలి అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు, పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ లు కోరారు.ఈరోజు తొర్రూరు లో స్థానిక పార్టీ కార్యాలయంలో బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ సభాద్యక్షతన గావ్ ఛలో -బస్తీ ఛలో అభియాన్ వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈసమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు, పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ సంయుక్తంగా మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అఖండ విజయం సాధించడం ఖాయమని తెలిపారు.భారత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని తెలిపారు.పిబ్రవరి 4,5, తేదీల్లో బీజేపీ శ్రేణులు దేశ వ్యాప్తంగా గావ్ ఛలో -బస్తీ ఛలో అభియాన్ లో భాగంగా పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, బస్తీల్లో పర్యటించి అక్కడి ప్రజలను కలిసి వారికి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి బీజేపీ వైపు ఆకర్షితులయ్యే విధంగా ఒక్క రోజు పూర్తి సమయం ఇచ్చి పనిచేయాలని సూచించారు.ఆయా ప్రాంతాల్లో నూతన ఓటర్లను కలవడం,స్వయం సహాయక సంఘాలు,యువజన సంఘాల ను, వివిధ వర్గాల మేధావులను,విద్యార్థులను ,రైతులను ఇలా అన్ని చోట్లా తిరుగుతూ విస్తృత ప్రచారం చేసే విధంగా ఈ కార్యక్రమంపై రూపొందించడం జరిగింది అని ,క్రేత్ర స్థాయి లో బీజేపీ బలోపేతానికి ఈ కార్యక్రమం ఉపయోగంగా ఉంటుంది
అని తెలిపారు.బీజేపి శ్రేణులు ఈకార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశం లో బీజేపీ ఎస్సీ మోర్చా మహాబాద్ పార్లమెంటు ఇంచార్జీ అలిసేరి రవిబాబు, జిల్లా, మండల నాయకులు పైండ్ల రాజేష్, గడల శేఖర్,సిహెచ్.విజయ్ కుమార్,సిహెచ్.శ్రీనివాస్,ఎన్.సందీప్, జగదీష్, నూకల నవీన్,రాజ కుమార్,శ్రీనాథ్, శివసాయి, తూర్పాటి రమేష్,ధరావత్ సురేష్, తేజస్, శ్రీనివాస్ చారి, కుమ్మరికుంట్ల శివ, నాగేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Comment List