జగన్ స్కెచ్ అదేనా? పాయకరావుపేటలో మళ్లీ ఇంఛార్జిలను మార్చే వ్యూహం
మహిళకు చోటు.. కార్పొరేషన్ చైర్ పర్సన్ కు టికెట్ ఇచ్చే ఛాన్స్
జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలతో టీడీపీ, జనసేన ఉక్కిరిబిక్కిరవుతోంది. బలహీన వర్గం అభ్యర్ధికి నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చి ఆ తర్వాత అసలైన క్యాండెట్ ను ప్రకటించే వ్యూహంలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. బలహీనమైన అభ్యర్ధిని ప్రకటించడం వల్ల.. టీడీపీ, జనసేన చాలా లైట్ తీసుకుంటారని.. చివరి నిమిషంలో అసలైన బలమైన అభ్యర్ధికి టికెట్ ఇస్తే..గెలుపు సులభం అవుతుందనే ఆలోచనలో వైసీపీ ఉంది. దీనికి దగ్గట్టుగానే అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఇంఛార్జిగా శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులును ప్రకటించారు. అయితే కంబాల జోగులుకు స్థానికంగా మద్దతు కరువైంది. ఆయన అయిష్టంగానే ఉన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో భారీగా కేడర్ మీటింగ్ కూడా పెట్టలేదు. ఆయన్ను కలిసేందుకు వైసీపీ స్థానిక నాయకులు కూడా ఇష్టపడటం లేదు. దీంతో ఈ నియోజకవర్గంలో కార్పొరేషన్ చైర్ పర్సన్ , స్థానికురాలైన మహిళ నాయకురాలిని బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికురాలికే టికెట్ ఇచ్చామనే కారణంతో భారీ మెజార్టీ సాధ్యమనే వైసీపీ శ్రేణులు భావిస్దున్నాయి. ఇప్పటికే నాలుగు మండలాల నాయకులు సైతం పార్టీ హైకమాండ్ దగ్గరకు వెళ్లి.. కంబాల జోగులును మార్చకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాజ్యసభ ఎన్నికల తర్వాత అభ్యర్ధిని మారుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List