మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

On
మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

IMG-20240205-WA0690
ఇన్సెట్లో మృతుడు సతీష్

మద్యానికి బానిసై కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం మండలంలోని వెలువర్తి గ్రామానికి చెందిన పసల సతీష్ (24), పసల భాగ్యరేఖకు వీరు ఇరువురికి ఐదు సంవత్సరాల క్రిందట వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల కాలంలో భర్త సతీష్ మద్యానికి బానిస కావడంతో మద్యం సేవించవద్దని కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించడం జరిగింది. అట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల నాలుగవ తేదీన సతీష్ భాగ్యరేఖతో పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి భావి వద్దకువెళ్ళాడు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో అతనికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సుమారు 6 గంటల ప్రాంతాన ఆమె మామ అయిన బాలస్వామికి తెలుపగా అతను పొలానికి చూడగా సతీష్ అక్కడ ఉన్న బాదం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతలో అక్కడ ఉన్న బత్తిని బాలస్వామి మాదాసు మరియన్న మాదాసు జోసెఫ్ మృతదేహాన్ని కిందకు దించి ఇంటికి తీసుకొచ్చారు. దీనితో ఫిర్యాదురాలు భాగ్యరేఖ తన భర్త మృతి పై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపింది. ఇట్టి కేసుపై ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్, ఏఎస్ఐ శ్యాంసుందర్ రెడ్డి లు తెలియజేశారు.

Views: 34

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News