గురుకులాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి

ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల వార్షికోత్సవం

గురుకులాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి

 

మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని, విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాలలోనే పునాది పడుతుందని మహాత్మ జ్యోతిబాపూలే సిఓఈ వీరభద్రం అన్నారు. శనివారం కొత్తగూడెం పరిధిలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాలు పాఠశాల ప్రిన్సిపల్ ఈ స్వప్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాత్మ జ్యోతిబాపూలే సిఓఈ వీరభద్రం, ఫ్రాన్సిస్, స్పెషల్ ఆఫీసర్ విద్యాసాగర్ లు ముఖ్యఅతిథిలుగా పాల్గొని పాఠశాల ప్రిన్సిపాల్ ఈ స్వప్న,ఏటిపి డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎం పద్మశ్రీ, బి అరుణావతి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంజెపిటి సిఓ ఈ వీరభద్రం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మొదటి మెట్టు పాఠశాల అని, గురుకుల పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు నేడు గొప్ప ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చి పెట్టే విధంగా నడవడిక ఉండాలన్నారు. ఏ రంగంలో చూసిన గురుకుల విద్యార్థులే అధిక సంఖ్యలో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థినుండే క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశానికి సేవ చేయాలని ఉద్బోధించారు. ఎక్కడ పోటీ ఉంటుందో అక్కడ పోరాడే పఠిమను విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు.

*విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యున్నత శిఖరాలు చేరుకోవాలి-ప్రిన్సిపల్ ఈ స్వప్న.

శనివారం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో జరిగిన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఈ స్వప్న పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు.విద్యార్థులు క్రమశిక్షణతో రాణించి మన మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల పేరు ప్రఖ్యాతలను రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయాలని విద్యార్థులకు తెలిపారు. ఇదే సంస్థ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకున్న పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.క్రమశిక్షణ, ప్రశాంత వాతావరణం, క్రీడామైదానం,ఉత్తమ ఉపాధ్యాయులు లభించడం విద్యార్థుల అదృష్టమన్నారు. అనంతరం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఎన్ హేమంత్ వర్ధనాచారి మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో అత్యధిక మార్పులు సాధించినందుకుగాను అతిథుల చేతుల మీదుగా విద్యార్థిని సన్మానించి మెమొంటో అందజేశారు. అలాగే విద్యలో, క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలు,షీల్డులు తన చేతుల మీదుగా అందించారు.పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహుతులను,సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఈ స్వప్న ,ఏటీపీ డాక్టర్ సి ప్రవీణ్ కుమార్,ఎం పద్మశ్రీ, పి అరుణావతి,ఎన్ శ్రీనివాస్,జి రవికుమార్,కె నగేష్,పి ప్రవీణ్,పి స్నేహలత,ఎం మమత, అతిధి అధ్యాపకులు తిరుమలగిరి వెంకటేశ్వర్లు, బాలరాజు,లోహిత, సందీప్,నవీన్,రాహుల్, విశ్వనాథ్,శ్రీకాంత్, మమత,నరసింహా, లింగస్వామి,శేఖర్, షబానా,సుశీల,డి సరిత, ఎం సరిత, ఖదీర్, పిఈటి మాస్టర్ వెంకట్రావు, పాఠశాల డీఈఓ నాగరాజు,ధీరజ్, గురవయ్య,ఉమ,జిఎన్ ఎం ఆరూరి రజిని, అటెండర్ సబిత తదితరులు పాల్గొన్నారు.IMG-20240210-WA1030

Read More ఘనంగా పుట్టినరోజు వేడుకలు

Views: 201

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్