ఎంపీటీసీ అరే లావణ్య రవీందర్ ను బిజెపిలోకి రావాలని ఆహ్వానించిన -

ఎంపీ అరవింద్, బాల్కొండ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి

On
ఎంపీటీసీ అరే లావణ్య రవీందర్ ను బిజెపిలోకి రావాలని ఆహ్వానించిన -

ఇందూరు, ఫిబ్రవరి20, న్యూస్ ఇండియా ప్రతినిధి

ఇందూరు పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నేతలు ఆ గట్టు నుంచి ఈ గట్టుకు దాటి పోతున్నారు. తాజాగా భింగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత, భింగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఆరే లావణ్య రవీందర్ ఇటీవలే కారు పార్టీకి గుడ్ బై చెప్పిన  విషయం తెలిసిందే.. 

ఆరే లావణ్య రవీందర్ రాజినామ చేసి నేల  గడవక ముందే బిజెపి పెద్దలు సంప్రదింపులు జరిపి. కమలదళం వైపు రావాలని ప్రయత్నాలు షురూ  చేశారు.. IMG-20240220-WA0035ఇందూరు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున రెడ్డి అధ్వర్యంలో నియోజకవర్గ కన్వీనర్ మల్కన్న గారి మోహన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు ములిగే మహిపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమ్మేడా మల్లికార్జున్ లు స్వయంగా మెండోరా యంపీటీసీ ఆరే లావణ్య రవీందర్ ఇంటికి వెళ్లి బిజెపి లోకి రావాలని వారితో పాటు బీఆర్ యస్ పార్టీ నాయకులను ఆహ్వానించారు. ఇందూరు ఎంపీ ధర్మపురి అరవింద్, బాల్కొండ ఇంచార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆహ్వానాన్ని అరే లావణ్య రవీందర్ తో పాటు పలువురు బీఆర్ యస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. img_20240206_174643

త్వరలోనే తమ కార్యకర్తలతో పాటు బీఆర్ యస్ పార్టీ నాయకులు బిజెపి పార్టీలో చేరుతున్నట్టు  మంగళవారం ఉదయం ఎంపీటీసీ ఇంట్లో జరిగిన ఆత్మీయుల మద్యలో జరిగిన సమావేశంలో నిర్ణయించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం..

Views: 164

About The Author

Post Comment

Comment List

Latest News

అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే ) అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
మేరా యువ భారత్ ( మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ) వారి సహకారంతో సయ్యద్ యూత్ క్లబ్ వారు గుడ్ గవర్నెన్స్ డే...
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల