విజయవంతంగా జెన్ఫోల్డ్ సంబరాలు

జెన్ఫోల్డ్ రెండవ వార్షికోత్సవం

By Ramesh
On
విజయవంతంగా జెన్ఫోల్డ్ సంబరాలు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లో గల ఏసియాలోనే అత్యంత పరిశ్రమలు కలిగిన పేరుగాంచిన 'ఐల' లో జెన్ఫోల్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. జెన్ఫోల్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాత్రి జెన్ఫోల్డ్ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెన్ఫోల్డ్ కో-ఫౌండర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్ర గుణపాటి మరియు డైరెక్టర్ అరుణ్ దూబే హాజరయ్యారు. తమ ఉద్యోగులు నిర్వహించిన కార్యక్రమాన్ని వీక్షించి హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యకమానికి యాంకర్ గా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ మలిగే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జెన్ఫోల్డ్ కో-ఫౌండర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్ర గుణపాటి మరియు డైరెక్టర్ అరుణ్ దూబే మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసిన జెన్ఫోల్డ్ హెచ్.ఆర్ మేనేజర్ శ్రావణ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ మలిగే మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగ గోపి లను అభినందించారు. జెన్ఫోల్డ్ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆట పోటీలలో గెలుపొందిన విజేతలకు మరియు రన్నెరప్ లకు శరత్ చంద్ర గుణపాఠి మరియు అరుణ్ దూబే లు బహుమతులు అందజేశారు.InShot_20240303_114007938

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం
ఖమ్మం తిరుమాలయ పాలెం మండలం బచ్చోడు  తండా గ్రామపంచాయతీ  వద్ద రిలయన్స్ ఫౌండేషన్, ఎరిస్ ఆగ్రో వారు      సంయుక్తంగా, భూసార పరీక్షలు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
పాత కేసు ను చూపి రూ 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
లారీ, బైక్ డీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు
పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు
ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ సాగు పై అవగాహన సదస్సు