*ప్రభుత్వ ఆసుపత్రిని హబ్ గా మార్చిన వైద్యులు*

డిప్యూటీ డిఎంహెచ్ఓ జన్మదిన వేడుకలు.. •ఆపరేషన్ థియేటర్ను హబ్ గా మార్చిన వైనం.. •ఆటపాటలతో కేక్ కటింగులు..రోగులను పట్టించుకోని వైద్యులు

*ప్రభుత్వ ఆసుపత్రిని హబ్ గా మార్చిన వైద్యులు*

వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పనితీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది.ఈ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉన్న వైద్యమందక రోగులు అవస్థలు పడుతున్నారు.ఒక్క రోజుకు ఈ ఆస్పత్రికి 300ల పైనే ఔట్‌ పేషెంట్లు వస్తారు. అన్ని రోగాలకూ ఒక్కటే మందు అన్న చందగా వైద్యులు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యులు ఇష్టానుసారం విధులకు హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రి డిప్యూటీ డిఎంహెచ్వో జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌండ్ బాక్సులు పేట్టి పేద బొబ్బలతో అరుస్తు పార్టీ లాగా చేశారని చర్చనింశంగా మారింది,ఆసుపత్రికి వచ్చిన రోగులను ఎవరుకూడ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.వైద్యులు ఆసుపత్రిలో ఉన్న అన్ని గదులకు తాళాలు వేసి ఆపరేషన్ థియేటర్ హాల్ ను మాత్రం తెరచి ఉంచి.. ఆటపాటలతో డీజే మోతలతో ఆపరేషన్ థియేటర్ ని డీజే హబ్ గా మార్చారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం మురళీధర్ పుట్టినరోజు కాబట్టి ఆసుపత్రిలో సౌండ్ బాక్స్ లు పెట్టి బిర్యానీ వండించి అందరికీ బిర్యానీ పార్టీ మరియు మందు పార్టీ ఇచ్చి సంబరాలు చేసుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎంతో మేలు జరిపే వైద్యులే ఈ విధంగా ఫంక్షన్లు జరుపుకుంటే మరి వైద్యం కోసం వచ్చిన రోగులను ఎవరు పట్టించుకోవాలని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ ఆసుపత్రి మొత్తం దద్దరిల్లేలా సౌండ్ బాక్సులు పెట్టి ఇస్ ద లెజెండ్ అనే నినాదంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ కు జన్మదిన శుభాకాంక్షలు సిబ్బంది తెలిపారు. అసలు వైద్యులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించేందుకు లేక వైద్యులు మందు పార్టీలతో భజనలు చేసుకునేందుకు అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

*వైద్యం కోసం వచ్చాను..తాళాలు వేశారు*
పెద్దవంగర నుండి వైద్యం కోసం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను.కానీ ఆసుపత్రిలో అన్ని రూములకు తాళాలు వేసి వెనక ఆపరేషన్ థియేటర్ హాల్లో సౌండ్ బాక్సులు పెట్టి పార్టీ చేసుకుంటున్నారు.వైద్యం కోసం వచ్చిన నన్ను మాత్రం ఎవరు కూడా పట్టించుకోలేదు. దయచేసి ప్రజలకు మేలు జరిగే విధంగా వైద్య సేవలు అందించే విధంగా సంబంధిత అధికారులు మేలు చేయాలని కోరుకుంటున్నాను.

Views: 29
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.