ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టినరోజు వేడుకలు నిజమే

తొర్రూర్ ఆర్డీవో నర్రసింహారావు

ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టినరోజు వేడుకలు నిజమే

మహబూబాబాద్ జిల్లా 
తొర్రూరు డివిజన్


మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన డిప్యూటీ డిఎంహెచ్ఓ జన్మదిన వేడుకల సందర్భంగా ఆసుపత్రిని హబ్ గా మార్చిన వైనం అనే వార్త సివిఆర్ చానల్లో ప్రచారం కాగా అట్టి వార్తకు స్పందించిన కలెక్టర్,వెంటనే స్థానిక ఆర్డిఓ మరియు ఎమ్మార్వో కు విచారణ చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆర్డీవో నరసింహారావు ఎమ్మార్వో వినోద్ కుమార్ కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని విచారణకు దిగారు.వారు మాట్లాడుతూ.....డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ పుట్టినరోజు సందర్భంగా ఆపరేషన్ థియేటర్ హాల్లో సౌండ్ బాక్సులు పెట్టుకొని అరుపులు చేస్తూ జన్మదిన వేడుకలు జరుపుకున్నారని,అదేవిధంగా మురళీధర్ యొక్క ఫ్యామిలీతో మరియు 10నుండి 120 మంది స్టాఫ్ తో, వారికి బిర్యానీ పెట్టడం,మరియు,అక్కడికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా జన్మదిన వేడుకలు జరుపుకున్నారని తెలిపారు.ఎది ఏమైనా ఏవిధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం సరికాదని,అట్టి నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపించమని ఆర్డీవో నరసింహారావు తెలిపారు.అదేవిధంగా మెయిన్ డోర్ తలుపులు ఓపెన్ చేసి మిగతా తలుపులు అన్నిటినీ మూసివేయడం జరిగిందన్నారు. ఇట్టి నివేదికను కలెక్టర్ నిమిత్తం పంపించామని మిగతా తగు చర్యలను కలెక్టర్ తీసుకుంటారని తెలిపారు.

Views: 21
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..