శ్రీ సరస్వతి విద్య మందిర్ లో వీడ్కోలు హంగామా
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు
On
భింగల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్య మందిర్ పాఠశాలలో వీడ్కోలు వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. 10తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డా, బసంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చవచ్చన్నారు. అదేవిధంగా వచ్చే విద్యాసంవత్సరం నూతన విద్యా విధానం ను అమలు పరుస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. ముగింపులో విద్యార్థులు చేసిన పాటలు, నృత్యాలు, డ్యాన్సులతో పాఠశాలలో సందడి నెలకొంది.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నర్సయ్య, సుధాకర్ రావు, అరవింద్, శ్రీధర్,భన్, ప్రిన్సిపాల్ రవి కుమార్,ప్రధానఉపాధ్యాయులు నర్సారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Read More రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
Views: 128
Tags:

Comment List