బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి

- వ్యక్తిగతంగా కేటీఆర్ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ప్రస్థావన..

On
బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల, మార్చి11, వాయిస్ టుడే ప్రతినిధి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి  మాజీ సర్పంచ్  నేవూరి వెంకట్ రెడ్డి రాజీనామా సమర్పించారు. ఈ యొక్క రాజీనామా పత్రాన్ని  బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు సోమవారం పంపినట్లు  నేవూరి వెంకట్ రెడ్డి తెలిపారు. FB_IMG_1710171191620

ఈ సందర్భంగా  నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ లో  క్రియాశీలక రాజకీయాల్లో గత పది సంవత్సరాలుగా ఆకింత భావంతో పని చేస్తున్నామన్నారు,సిరిసిల్ల శాసన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విశ్వాసం తో నమ్మకంతో  ఇన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీ అబివృద్ధి కోసం పని చేశామన్నారు తాను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అందరికీ సుపరిచితున్ని అయిన  నాకు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు,వ్యక్తిగతంగా చిల్లి గవ్వ పని కూడా కెటిఆర్ తమకు చేయలేదని దీంతో బిఆర్ఎస్ పార్టీ కీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని నేవూరి వెంకట్ రెడ్డి, తెలిపారు,తన శ్రేయాబిలాషులతో భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ప్రజాసేవచేయడం కోసం ఏ పార్టీలో చేరాలనేది త్వరలోనే  ప్రకటిస్తామన్నారు.

Views: 86
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.