ఎక్సైజ్ శాఖలో ఇంటి దొంగలు*

సీజ్ చేసిన మద్యాన్ని అక్రమ తరలింపు ●గమనించిన స్థానికులతో అధికారులు..డీలింగ్.

ఎక్సైజ్ శాఖలో ఇంటి దొంగలు*

*ఎక్సైజ్ శాఖలో ఇంటి దొంగలు*
●సీజ్ చేసిన మద్యాన్ని అక్రమ తరలింపు
●గమనించిన స్థానికులతో అధికారులు..డీలింగ్...

ఎక్సైజ్ శాఖలో ఇంటి దొంగలే రాజ్యమేలుతున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన సిబ్బందే.. తప్పుదారి పట్టి అక్రమార్జనకు తేరలేఫుతున్నారు. అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి తదితరాలను నియంత్రించి ప్రజలను కాపాడాల్సింది పోయి.. ఎక్సైజ్ సిబ్బందే ఎంచక్కా గతంలో పట్టుబడిన మద్యాన్ని దారి మళ్లించిన ఘటన వెలుగులోకి వచ్చింది.మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ పట్టణ ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో గతంలో పట్టుబడిన భారీ మద్యాన్ని సీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే...కానీ సీజ్ చేసిన మద్యాన్ని పక్క త్రోవ పట్టించడానికి ఎక్సైజ్ అధికారులు పట్టంకట్టుకున్నారు.. గతంలో ఎక్సైజ్ అధికారుల సోదాల్లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఒక్క ఆటో(TA03UA6275) సహాయంతో  స్థానిక పట్టణ కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయం దగ్గర నుండి సీజ్ చేసిన మద్యంను తీసుకెళ్తుండగా..ఇద్దరు స్థానికులు వీడియోలు ఫోటోలు తీసి..ఆ సీజ్ చేసిన మద్యాన్ని పట్టణ కేంద్రంలోని  భద్రకాళి వైన్స్ కు ఇద్దామని ఎక్సైజ్ అధికారులు వెళ్ళగా..భద్రకాళి వైన్స్ దగ్గరకు ఆ ఇద్దరు స్థానికులు ఆటోను వెంబడించగా..స్థానికులు  సీజ్ చేసిన మద్యాన్ని ఎక్కడికి తరలిస్తున్నారని అడుగుతున్న క్రమంలో గమనించిన.. భద్రకాళి వైన్స్ యజమాని మా షాపులో వద్దంటే వద్దని చెప్పగానే... మరో వైన్స్ షాపుకు తరలించినట్లు సమాచారం.వెంటనే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పందించి అక్రమానికి పాల్పడిన ఎక్సైజ్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తరలిస్తున్న మద్యాన్ని చూసిన  స్థానికులతో.. డీలింగు మాట్లాడుకున్నట్లు సమాచారం... ఈ అంశాలన్నీ క్లుప్తంగా తెలియాల్సి ఉంది... మరో షాపు కు తరలించిన ఆధారాలు కూడా తెలియాల్సి ఉంది.

Views: 139
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు