మండల పార్టీకి తెలవకుండా కాంగ్రెస్లో చేరితే పార్టీకి సంబంధం లేదు
నూనవత్ రమేష్ నాయక్ సస్పెండ్ కొనసాగాల్సిందే.
గుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకన్న
మండల కమిటీకి తెలవకుండా పార్టీలో చేరితే సంబంధం లేదు
* మాజీ మండల అధ్యక్షులు నూనావత్ రమేష్ నాయక్ కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.
* మండలం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చిట్టే. వెంకన్న.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
గూడూరు మండల కేంద్రంలోని మండల కమిటీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశాన్ని ఏపూరి శ్రీనివాస్ రెడ్డి గృహంలో ఏర్పాటు చేయగా మండల అధ్యక్షులు చిట్టే వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నూనవత్ రమేష్ నాయక్ సస్పెన్షన్ను ఎత్తివేసినట్టు అబద్ధపు సమాచారాన్ని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు చెన్నారెడ్డి దగ్గర నుండి తీసుకు వచ్చానని మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకొని మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచిన పోరిక బలరాం నాయక్ గెలుపు కొరకు ప్రచారం చేస్తున్నట్టు మండల కమిటీకి తెలియ వచ్చినది కనుక కాంగ్రెస్ పార్టీకి, నూనవత్ రమేష్ నాయక్ కు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. అదేవిధంగా కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన వారిని మండల నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని మండల కమిటీకి తెలియ వచ్చిందని వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోబోమని గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నీ అనుసరించి మండల కమిటీ ఆధ్వర్యంలో చేరికలు జరగాలని ఎవరు పడితే వారు కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్లో తిరుగుతాను అంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ గూడూరు మండల అధ్యక్షులు చిట్టే.వెంకన్న హెచ్చరించారు.కార్యక్రమంలో. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లికొండ మధు, జిల్లా కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు, జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చంటి స్వామి , గూడూరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాసమల్ల యాకయ్య. జిల్లా సహాయ కార్యదర్శి అర్రెమ్ వీరస్వామి. మాజీ ఎంపీపీరేగ వెంకటేశ్వర్లు.సర్పంచ్ గుణంగా మాజీ సర్పంచ్ రవి సింగ్ రాథోడ్. రామ్ సింగ్ తండా మాజీ సర్పంచ్ మంగీలాల్. మండల నాయకులు బోయిన్పల్లి సతీష్ రావు. యాదవ్ రెడ్డి. సమ్మటి శ్రీనివాస్. ఏదుల ఆదినారాయణ. మాదాస్ రమేష్. గడిల రమేష్. Sc సెల్ మండల అధ్యక్షుడుముత్యం లక్ష్మీనారాయణ. గూడూరు మండల్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ కిషన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాకెళ్లి వీరస్వామి యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి సునీల్.హెచ్ మనోజ్. టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లపు నాగరాజు లు పాల్గొన్నారు.
Comment List