నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్ళు

లేబర్ కోడ్ రద్దుకై 23 నా మహబూబాబాద్ లో రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

On

 

Read More శబ్బాష్.. మున్సిపాలిటీ

 

నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్లు.

లేబర్ కోడ్ ల రద్దుకై 23 మహ.బాద్ లో రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.

Read More యాత్ర దానం ???

 

 ఐఎఫ్ టియు రాష్ట్ర జిల్లా అధ్యక్షులు విశ్వనాధం.

Read More సంగారెడ్డి అర్డిఓ కార్యాలయానికి పట్టిన ‘గ్రహణం వీడింది’

 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) జూన్ 21:29 కార్మిక చట్టాలను రద్దుచేసిన మోడీ ప్రభుత్వం 2019లో తెచ్చిన లేబర్ కోడ్ లు కార్మికులకు అత్యంత ప్రమాద కరమైనవని నాలుగు లేబర్ కోడులకు వ్యతిరేకంగా కార్మిక లోకం తీవ్రంగా ఆందోళనచెందుతున్నారని ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక ప్రయోజనాల రీత్యా నాలుగు లేబర్ కోడులను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించాలని, నాలుగు లేబర్ కోడులకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మాణం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అధ్యక్షులు ఎల్.విశ్వనాథం డిమాండ్ చేశారు.లేబర్ కోడులను రాష్ట్రంలో అమలు చేయవద్దని డిమాండ్ చేస్తూ 23న మహబూబాబాద్ లో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విశ్వనాధం ప్రసంగిస్తూ 1885లో 8 గంటల పనిని కార్మిక వర్గం పోరాడి సాధించిందని,ప్రపంచ కార్మిక దినోత్సవం(మేడే)గా గుర్తింపు పొందిందని నేడు మోడీ ప్రభుత్వం దేశంలో 12 గంటల పనిదినాన్ని తీసుకురావడం వేతనాలు, యూనియన్ పెట్టుకునే హక్కు,బోనసు, సౌకర్యాలు తదితర కార్మిక హక్కులను కాలరాచి వేస్తూ లేబర్ కోడులను తీసుకు రావడం కార్మికులకు ఉరితాడు లాంటివని అన్నారు. కేవలం యాజమాన్యాలు దోపిడి వర్గాలు ప్రధానంగా కార్పొరేట్ శక్తుల కాళ్ళ మీద పడేందుకు కార్మిక వర్గాన్ని సిద్ధం చేసేందుకు మాత్రమే నాలుగు లేబర్ కోడులు తీసుకువచ్చారని అన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు, జిఎల్ బికేఎస్ జిల్లా నాయకులు ఎ.గట్టయ్య,అలీ ముద్దిన్,మారుతిరావు,సంజీవరావు,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 72
Tags: Breakiing

About The Author

Post Comment

Comment List

Latest News