వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
కొత్తగూడెం (న్యూస్ ఇండియా)జూన్ 22: లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామపంచాయతీలో వరకట్న వేధింపులతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాల బోయిన మానస(20)సూర్యాపేట జిల్లా నడిగూడెం బృందావనపురం గ్రామానికి చెందిన యువతికి లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామానికి చెందిన సంతోష్ తో వివాహం జరిగింది. కొన్ని నెలల పాటు వీరి దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉండి ఒక బాబు కూడా జన్మించాడు. సంవత్సరం తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించడంతో యువతి శుక్రవారం రోజు పురుగుల మందు తాగింది స్పందించిన స్థానికులు కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదుకు మెరుగైన చికిత్స కోసం తీసుకు వెళుతుండగా మార్గ మధ్యలో మృతి చెందింది యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మిదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List