తొర్రూర్ మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా.......

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి......సమగ్రంగా చర్చించిన అధికారులు పాలకమండలి

తొర్రూర్ మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా.......

 

మహబూబాబాద్ జిల్లా IMG_20240704_170930 తొర్రూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రశాంతంగా సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశానికి చైర్మన్ రామచంద్రయ్య  అధ్యక్షతన ముఖ్యఅతిథిగా ఎక్స్ అఫీషియో మెంబర్ పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి  వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి. కమిషనర్ శాంతి కుమార్ పాల్గొన్న సమావేశంలో   మున్సిపాలిటీకి  సంబంధించిన నివేదికను సమావేశంలో కమిషనర్ శాంతికుమార్ ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అలాగే  వార్డ్ ల వారిగా   అభివృద్ధి పనులపై కూడా పాలకమండలితో చర్చించారు. ఇప్పటికే వార్డులలో 62 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని మున్సిపాలిటీ నిధులను ప్రజలకు అవసరమయ్యే రీతిలో ఖర్చు అయ్యేవిధంగా ప్రతి ఒక్క కౌన్సిలర్ కృషి చేయాలన్నారు. సిబ్బంది కూడా తక్కువగా ఉండటం వల్ల శానిటేషన్ సిబ్బందిని పెంచుటకు గవర్నమెంట్ కు సిఫార్సు చేస్తానన్నారు. రానున్న రోజుల్లో తొర్రూర్ ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రోజు రోజుకు తొర్రూరు పట్టణ అభివృద్ధి చెందుతున్నందున మాస్టర్ ప్లాన్ రెడీ చేయుటకు టౌన్ ప్లానింగ్ అధికారిని ఆదేశించినారు. మున్సిపాలిటీల్లో అధికారులక కొరత ఉన్నందున గవర్నమెంట్ కు సిఫారసు చెసి రెగ్యులర్ అధికారులను నియమించుటకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.అనంతరం చైర్మన్ మాట్లాడుతూ వార్డ్ ల వారీగా 5 లక్షల రూపాయలు మంచినీటి కోసం రెండు లక్షలు ప్రతి వార్డ్ ఏడు లక్షలు రూపాయలు కేటాయించామని ఈ ఏడు లక్షల రూపాయలని వార్డ్ అభివృద్ధికి అవసరం ఉన్న మేర కేటాయించాలని అన్నారు. అలాగే అమరవీరుల  స్థూపం మహనీయుల విగ్రహాలకు సుందరీకరణ విషయంలో తీర్మానం చేయడం జరిగిందన్నారు  కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు. మున్సిపల్ ఏఈ రంజిత్. మేనేజర్ కట్టా స్వామి. కౌన్సిలర్లు భూసాని రాము. తునం రోజా. తూర్పాటి సంగీత రవి. పేర్ల యమునా జంపా. దారావత్ సునీతజైసింగ్.నరుకుటి గజానంద్. చగిలేలా అలివేలు.దొంగరి రేవతి శంకర్. కర్నె నాగజ్యోతి నాగరాజు. గూగులోత్ శంకర్. కొలుపుల శంకర్. కోఆప్షన్ సభ్యులు.  మహమ్మద్ జలీల్. కుర్ర కవిత శ్రీనివాస్. అకౌంటెంట్ శ్రీనివాసరావు. మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు*

Views: 31
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.