రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం..

పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..

On

IMG_20240803_174304
వాహనాలను పరిశీలిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్

రంగారెడ్డి, ఆగష్టు 03 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసే వాళ్లపై పిడి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు వాహనం ఆర్సి రద్దు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కు సిఫారసు చేయనున్నట్లు పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన శంషాబాద్ ఓఆర్ఆర్ ప్రాంతంలో పలువాహన వాహనాలను రేషన్ బియ్యం దందాకు వాడుతున్నారు అన్న అనుమానంతో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ ప్రారంభమై నాలుగు రోజులు అయ్యిందని దీంతో కొందరు రేషన్ దందా అక్రమార్కులు గుర్తుగా స్టార్ట్ తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు దీంతో పెద్ద గోల్కొండ, శంషాబాద్ జాతీయ రహదారిపై అనుమానంతో పలు వాహనాలను తనిఖీ చేసి ఆయా లోడ్లలో ఉన్న సరుకు ఏంటి అని ఆరా తీసినట్లు విచారించారు. రేషన్ బియ్యం అక్రమంగా దందా చేస్తే జైలు శిక్ష ఖాయమని రఘునందన్ హెచ్చరించారు. రేషన్ బియ్యం కొంటే మిల్లు మూసేయడమే అని పలు మిల్లులకు సైతం హెచ్చరిక జారీ చేశామన్నారు.

Views: 17
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
వృద్ధుల ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసాసీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీదేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలను గుర్తించి, మహాత్మ హెల్పింగ్ హాండ్స్...
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
నూతన సంవత్సర వేడుకల వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )