'స్వచ్చధనం-పచ్చదనం' అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలపై' అవగాహన సదస్స్
న్యూస్ ఇండియా తెలుగు ఆగస్టు 6 పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
ఘణపురం రంజిత్ కుమార్: పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో ఈరోజు స్వచ్ఛదనం-పచ్చదనం, మరియు అంతర్జాతీయ 'తల్లిపాల వారోత్సవాల' గురించి దర్దేపల్లి గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని గ్రామపంచాయతీ మరియు ఆరోగ్య ఉప కేంద్రం అంగన్వాడి కేంద్రం వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అందరూ పాల్గొని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిలువ ఉంచకుండా పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే పచ్చదనంతో గ్రామం ఆదర్శంగా తీర్చిదిద్దేలా చెట్లను నాటే విధంగా చూడాలని దర్దేపల్లి గ్రామ జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేగాక ప్రజలందరు ఐకమత్యంగా స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలియజేయడం జరిగింది. అంతేగాక అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలుఘనంగా జరపడం జరిగింది, తల్లిపాలలో ఉన్న గొప్పదనాన్ని పుట్టిన బిడ్డకు తల్లిపాలలో ఉండే పోషకాల విలువలు గురించి ఊరంతా ర్యాలీ గా తిరిగి అందరికీ తెలిసేలా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్దేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఇమ్మడి ప్రకాష్, గ్రామపంచాయతీ సెక్రటరీ, జయశ్రీ, ఏ ఎన్ ఎం విజయ, ఆశా వర్కర్లు జలగం కల్పన, రాణి, ఝాన్సీ, మరియు అంగన్వాడి నిర్వాహకులుతాళ్లపల్లి వాణి, చిదురాల ఉపేంద్ర, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులు మరియు దర్దేపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది, జలగం బొర్రం ముజీబ్, జలగం బొర్రం కృష్ణ, జలగం బొర్రం రాజు, చంద్రయ్య, వేల్పుల సోమయ్య పాల్గొన్నారు.
Comment List