గురుకుల పాఠశాలలో దారుణం

బాలికపై క్యాటరింగ్ వర్కర్ లైంగిక వేధింపులు

By Venkat
On
గురుకుల పాఠశాలలో దారుణం

పాలకుర్తిలోని గురుకుల పాఠశాలలో ఘటన

పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తిలోని గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న బాలికపై క్యాటరింగ్ వర్కర్ నిత్యం లైంగికంగా వేధించడంతో ఆ మైనర్ బాలిక సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని బాలిక తల్లిదండ్రులు ప్రశ్నించగా గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలిక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు వచ్చి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు క్లాస్ టీచర్ ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని తమకి ఏమి తెలియదు అంటూ దాటవేశారని తెలిపారు. దీంతో వేధింపులకు పాల్పడిన క్యాటరింగ్ వర్కర్ పై పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.Screenshot_20240813-124949

Views: 36
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మం ఏప్రిల్ 12 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఖమ్మం వెలాసిటీ జూనియర్ కళాశాలలో విజయకేతనం ఎగరవేసింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్టేట్...
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం