కలకత్తాలో వైద్య కళాశాల విద్యార్థిని హత్యపై సమగ్ర విచారణ జరపాలి

వామపక్ష పార్టీల నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు, బొల్లం అశోక్ లు డిమాండ్ చేశారు

కలకత్తాలో వైద్య కళాశాల విద్యార్థిని హత్యపై సమగ్ర విచారణ జరపాలి

IMG-20240819-WA0089 కలకత్తాలో వైద్య కళాశాల విద్యార్థిని హత్యపై సమగ్ర విచారణ జరపాలి

.సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి,నిందితులను కఠినంగా శిక్షించాలి,

వామపక్ష పార్టీల నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు, బొల్లం అశోక్ లు డిమాండ్ చేశారు

 

Read More ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 

   కలకత్తా  రాష్ట్రంలో ట్రైనీ వైద్య విద్యార్థినీపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి చే సమగ్ర విచారణ జరిపి,దోషులను కఠినంగా శిక్షించాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్ లు కేంద్ర ప్రభుత్వాన్ని,పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
సోమవారం తొర్రూరు మండల కేంద్రంలో  వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్యర్యం లో కలకత్తా లోనీ ఆర్జీకార్ హాస్పిటల్ లో ట్రైనీ  వైద్య విద్యార్థీ నీపై జరిగిన హత్యచారాన్ని నిరసిస్తూ, గాంధీ సెంటర్లో  నిరసన వ్యక్తం చేయటం జరిగింది. అనంతరం వామపక్ష పార్టీల నాయకులు విశ్వేశ్వరరావు, అశోక్ లు మాట్లాడుతూ, 78 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ప్రభుత్వాలు నేటికి విద్యార్థినిలకు, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మద్యం, డ్రగ్స్,, అశ్లీల చిత్రాలు ,బూతు సాహిత్యాల ను పూర్తిస్థాయిలో అరికట్టకుండా దిశా, నిర్భయ లాంటి చట్టాలెన్ని తెచ్చిన ఉపయోగం ఏమిటని పాలకులను ప్రశ్నించారు.? పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకుండా మౌనం పాటించడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రభుత్వాలను విమర్శించారు.
తక్షణమే పాలకులు స్పందించి అర్జీకార్ ఘటనకు కారకులైన దుండగులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి, కఠినంగా శిక్షించాలని, వైద్య విద్యార్థిని కుటుంబాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆఫీసులో, ఇతర అన్ని ప్రదేశాలలో పనిచేస్తున్న మహిళలకు పటిష్టమైన రక్షణ కల్పించి, ఇలాంటి ఘటనలు దేశంలో మరాల పునరావృతం కాకుండా చూడాలని వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎండి యాకుబ్, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బందు మహేందర్, సహాయ కార్యదర్శి పేరబోయిన కిరణ్ కుమార్, సిపిఎం పట్టణ కార్యదర్శి జమ్ముల శ్రీను, నాయకులు గణపురం లక్ష్మణ్ పరశురాం ,ముద్రబోయిన వెంకన్న, బొల్లు వెంకన్న, కుమార్, శ్రీశైలం, కందులయాకయ్య, మహేష్, కొమరెల్లి, రాములు, వెంకన్న, రవి, భాస్కర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు..

Read More కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి

Views: 66
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News