ఐటిఐ అభ్యర్థులకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళ

వివరాలు తెలిపిన ఐటిఐ నోడల్ ఆఫీసర్ జి రమేష్

On

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 3: 09-09-2024 నాడు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం నందు ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ల అభ్యర్థులు  భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పరిదిలోగల వివిద పరిశ్రమలలో అప్పెంటిషిప్ ట్రైనింగ్ చేయుట కొరకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళ నిర్వహించుటకు నిర్వహించారు. ఇందు నిమిత్తము ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ ల అబ్యర్ధులు అందరు ముందుగా www.apprenticeshipindia.org.in నందు వారి పేరు నమోదు చేసుకొని అట్టి నకలు కాపీని, ఒక బైయో డేటా ఫామ్ ను మరియు తమ సంబందిత విద్యార్హత ధృవీకరణ పత్రాలు కూడా జత చేసి అప్రెంటిషిప్ మేలా కు హాజరు కావలసినదిగా కోరడమైనది.భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా లోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐ.టి.ఐ ప్రధానాచార్యులు, పరిశ్రమల యాజమాన్యాల వారు తమ పరిదిలోని అప్రెంటిషిప్ ఖాళీల వివరాలతో ది. 09-09-2024 నాడు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం నందు హాజరు అవుతారు.కావున భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా లోని ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ ల అబ్యర్ధులు అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనవలసినదిగా ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం ప్రదాణాచార్యులు మరియు భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా లోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐ.టి.ఐ నోడల్ ఆఫీసర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Views: 109
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం