కొత్తగూడెంనికి కొత్త బస్టాండ్ ఏర్పాటు చేయాలి
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
On
కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 5: కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గురువారం కొత్తగూడెం బస్టాండ్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగూడెం బస్టాండు పాతది అవ్వడం వల్ల పైనుంచి పెచ్చులు ఊడి పడుతున్నందున, వర్షాకాలం కారణంగా పైనుంచి వాటర్ లీక్ అవుతున్నాయని, తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ పూర్తి ఫలితం లేదన్నారు. ప్రభుత్వం కానీ ఆర్టీసీ సంస్థ గాని చొరవతో , కొత్తగూడెం, పాల్వంచలో కొత్త బస్టాండ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాష, డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, జూనియర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సునీత సిబ్బంది పాల్గొన్నారు.
Views: 105
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
భార్య భర్త ఘర్షణలో అన్నదమ్ముల గలాట...!
18 Sep 2024 21:54:34
-పెద్దకడుబూరు మండలం ఎస్‌ఐ పి.నిరంజన్ రెడ్డి వెల్లడి.*
Comment List