మాజీ మంత్రులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు
మాజీ మంత్రులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు
- సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య
ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజి మంత్రి హరీష్ రావు. సబితా ఇంద్రారెడ్డి లపై ఇతర బిఆర్ఎస్ ఎమ్మెల్యే పై అలాగే పార్టీ శ్రేణుల పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మనిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అయన గురువారం నాడు విలేఖరులకు ఒక ప్రకటనలో తెలియచేస్తు ఈ గత నాలుగు రోజుల నుండి దేశంలో భారీ వర్షాలు పడి ప్రజలు సతమతమవుతుంటే కాంగ్రెస్ వారు ఎక్కడ పడుకున్నారో తెలువదు అక్కడక్కడా సందర్శించడానికి వెళ్లిన ఫోటోలకు పోజులుస్తున్నారే తప్ప వారు ప్రజలకు చేసింది ఏమి లేదు కానీ
బిఆరెస్ పార్టీ నేతలు ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన బిఅరెస్ నేతలయిన హరీష్ రావు పై సబితా ఇంద్రారెడ్డి పువ్వాడ అజయ్ పై ఇతర ఎమ్మెల్యే వాహనాల పై దాడి చెయ్యడం నీచ రాజకీయం అని ఆయన మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ప్రజలను పరమార్శిస్తే రాళ్ల దాడి చేయడం పిరికి పంద చర్య అని అయన అన్నారు.
Comment List