పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి అడుగుజాడల్లో నడుచుకోవాలి

జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి అడుగుజాడల్లో నడుచుకోవాలి

టేక్మాల్ మండల కేంద్రంలోనీ బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యక్షులు రాములు ఆధ్వర్యంలో

 జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి కార్యక్రమం టేక్మాల్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉపాధ్యక్షులు వడ్డె రాములు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాద్యాయ గారు ప్రవచించిన, నిర్దేశించిన మార్గం అంత్యోదయతో ప్రభుత్వ ఫలాలు అట్టడుగు వర్గానికి చెందిన అత్యంత చివరి వ్యక్తి వరకు చేరుకోవాలన్న దృఢ సంకల్పం బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా కొనసాగుతుందన్న విశ్వాసం సమాజంలో కనిపిస్తుంది. పండిట్ దీన్ దయాల్ జీ స్ఫూర్తితో సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు భారతదేశాన్ని ప్రపంచంలోనే పరమ వైభవ స్థితిలో ఉంచేందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో విశేష కృషి భవిష్యత్తులో నిర్మాణం అవుతూనే ఉంటుంది అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లుపేట రాజు, ప్రధాన కార్యదర్శి సిద్ధిరాములు, భూత్ అధ్యక్షులు మంగళి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 8

Post Comment

Comment List

Latest News

ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
మత్స్యకారులను వృద్ధిలోకి తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ ముదిరాజ్ అన్నారు.  ముదిరాజ్...
నూతన సంవత్సర వేడుకల వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..