చికిత్స పొందుతున్న కవితను పరామర్శించిన రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నాయకులు.

వాల్మీకి బోయ కవితకు న్యాయం చేసేంతవరకు పోరాడుతాం....!

On
చికిత్స పొందుతున్న కవితను పరామర్శించిన రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నాయకులు.

న్యూస్ ఇండియా/పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 2 :- పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్న తుంబళం గ్రామంలో ఇటీవల జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోయ కవిత ను బుధువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ బోయ నాయుడు అనే యువకుడు పొట్ట కూటి కోసం తనవంతుగా ఆటో నడుపుకుని జీవనం సాగిస్తూ తన కుటంబాన్ని పోషించుకుంటూనే బతుకుతున్న నాయుడు మీద నాయుడు అక్క బోయ కవిత మీద గంగాధర్, వీరేష్ మరియు మరికొందరు వ్యక్తులు తప్పతాగి విచక్షణా రహితంగా చితకబాధి మహిళా అనికూడా చూడకుండా దాడిచేసి కడుపుమీద,వంటిమీద కొడుతూ చేయిని విరగొట్టడం జరిగిందన్నారు. బోయ నాయుడు కుటుంబ సభ్యులపై దుర్భాషలాడిన వారిని విడిచి ఎస్సై నిరంజన్ రెడ్డి తిరిగి బోయ కవిత మరియు వారి కుటుంబ సభ్యుల మీదనే కేసుపెట్టడం సబబు కాదని, ఈ సంఘటనను గురించి కర్నూలు జిల్లా ఎస్పి గారికి తెలియపరుస్తామన్నారు. వెంటనే బాధిత బోయ కవిత కుటుంబ సబ్యులందరికి న్యాయం చేయాలనీ కోరుతూ లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరుపున భారీ సంఖ్యతో జిల్లా స్థాయిలో ధర్నా చేపడతామని డిఎస్పి మరియు ఎస్పి గారికి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, మండల కార్యదర్శి వీరాంజనేయులు, పట్టణ ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి, పెద్ద కడబూరు మండల కార్యదర్శి చిన్న నరసప్ప, వాల్మీకి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 129
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News