దౌర్జన్యానికి పాల్పడిన యువకులపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

దౌర్జన్యంతో మహిళపై దాడికి యత్నించిన కొందరు యువకులు... .

On
దౌర్జన్యానికి పాల్పడిన యువకులపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

బాధిత కుటుంబానికి 5వేల రూపాయలు ఆస్తి నష్టం - ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి...

న్యూస్ ఇండియా/పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 11 :- మంత్రాల నియోజకవర్గం మండల కేంద్రమైన పెద్దకడబూరులో నిన్నటి దినము గురువారం రోజున కురువ సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాల మధ్య ఓ స్థలం వివాదంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కురువ సామాజిక వర్గానికి చెందిన పలువురు యువకులపై స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు నిన్నటి దినము గురువారం రాత్రి 7గంటల సమయంలో పెద్దకడబూరు గ్రామంలోని కురువ కాలనీలో నివసితున్న కురువ పార్వతమ్మ భర్త పేరు కురువ నాగన్న వయసు 55సం// ఆ కుటుంబం నివసిస్తున్న ఇంటి ప్రక్కల ఉన్న ఖాళీ స్థలంలో వారు పాతుకున్న బండలను అదే గ్రామంలోని కురువ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు సిరికి రాజు, విక్రమ్, రవి, గిరి, రామాంజి మరియు మరి కొందరు వ్యక్తులు కలిసి బాధిత కుటుంబమైన కురువ పార్వతమ్మ యొక్క స్థలంలో వీరు అక్రమంగా ప్రవేశించి కురువ పార్వతమ్మ తన స్థలంలో పాతుకున్న బండలను వివిధ రకాల ఆయుధాలతో వాటిని ధ్వంసం చేసి ఆ కుటుంబ సభ్యులను బెదిరించడం జరిగిందన్నారు. ఈ ఘటనలో కురువ పార్వతమ్మపై యువకులు దాడికి పాల్పడ్డారని, పార్వతమ్మకు సంబంధించి దాదాపు 5వేల రూపాయల విలువ గల ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు కురువ పార్వతమ్మ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో తెలపడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా దౌర్జన్యానికి పాల్పడిన పలువురు వ్యక్తులపై కేసు నమోదు చేయడమైందని ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు...IMG_20240913_195201

Views: 111
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News