లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...

On
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...

పెద్దకడుబూరులోని రెండు మద్యం షాపులకు 19మంది దరఖాస్తు...

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 14 :- ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన నూతన మద్యం పాలసీ విధానంలో భాగంగా కర్నూలు జిల్లాలోని జిల్లా పరిషత్ నందు సోమవారం ఉదయం నుంచి పారదర్శకంగా క్రమశిక్షణతో కర్నూలు జిల్లాలో మద్యం షాపుల లక్కీడ్రా సందడి సందడి గా కొనసాగింది. అయితే కర్నూలు జిల్లా మొత్తంగా మద్యం దుకానాలకు గాను పెద్ద సంఖ్యలో అప్లికేషన్ లో వచ్చాయి. ఆలాగే మద్యం షాపుల డెండర్లకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి గాను 2లక్షల రూపాయలు అప్లికేషన్ ఫీజును ప్రభుత్వం ఫిక్స్ చేసింది. మద్యం షాపుల లక్కీడ్రా డ్రిప్ కోసం కర్నూలు జిల్లా పరిషత్ లో ఏర్పాటు చేసిన ప్రదేశంలో సంబందిత జిల్లా అధికార యంత్రాంగం గట్టి బందోబస్త్ ను ఏర్పాటు చేసి లక్కీ డ్రిప్ ను పారదర్శకంగా నిర్వహించడం జరిగింది. లక్కీ డ్రిప్ హాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పెద్ద పెద్ద వీడియో స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికి మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరులోని 2 మద్యం షాపులకు టెండర్లు వేయడం జరిగింది. అందులో ఒకటి 75వ నంబర్ షాప్ కి 8మంది మరియు మరొకటి 76వ నంబర్ షాప్ కి 11 మంది టెండర్లు వేసి వారి అదృస్టాన్ని పరిష్కరించుకున్నారు. సోమవారం జరిగిన ఈ లక్కీడ్రా లో పెద్దకడుబూరులోని దిద్దికాటి తుకారాం (షాప్ నంబర్ 75 ) మరియు చిన్నకడుబూరు కలగట్ల లక్ష్మన్న ( షాప్ నంబర్ 76 ) లక్కీడ్రాలో ఇద్దరికీ లక్కీ ఛాన్స్ వరించింది... అయితే 16వ తేది బుధువారం నుండి ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అందుబాటులో ఉంచనుంది. లక్కీడ్రా లో మద్యం షాపులను దక్కించుకున్నవారికి 2సంవత్సరాలు మాత్రమే కాలపరిమితి ఉంటుంది. వీళ్ళు మద్యం షాప్ లైసెన్స్ కోసం 70లక్షలు మరియు పర్మిట్ రూమ్ పర్మిషన్ కోసం 5లక్షలు రూపాయలు విడుతల వారీగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది...IMG_20241014_210030

Views: 153
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News