శ్రీ నాగార్జున స్కూల్లో దారుణం ..

బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ విజయపురి కాలనీ శ్రీ నాగార్జున స్కూల్లో దారుణం చోటుచేసుకుంది

On
శ్రీ నాగార్జున స్కూల్లో దారుణం ..

శరన్ గౌడ్ అనే విద్యార్థి పేదరికం వల్ల విద్యా సంవత్సరం ఫీజు చెల్లించనందున స్కూలు యాజమాన్యం విద్యార్థికి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్లు అందించలేదని టిఆర్ఎస్వి రాష్ట్ర యువజన నాయకుడు సాయికుమార్ సూర్య వంశీ కు తెలియజేశారు.

శ్రీ నాగార్జున స్కూల్లో దారుణం ..

ఎల్బీనగర్, నవంబర్ 16 (న్యూస్ ఇండియా ప్రతినిధి): బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ విజయపురి కాలనీ శ్రీ నాగార్జున స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. శరన్ గౌడ్ అనే విద్యార్థి పేదరికం వల్ల విద్యా సంవత్సరం ఫీజు చెల్లించనందున స్కూలు యాజమాన్యం విద్యార్థికి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్లు అందించలేదని టిఆర్ఎస్వి రాష్ట్ర యువజన నాయకుడు సాయికుమార్ సూర్య వంశీ కు తెలియజేశారు.

Screenshot_2024-11-16-21-31-21-51_7352322957d4404136654ef4adb64504
తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలి..

విద్యార్థి స్థితిగతులను తెలుసుకున్న సాయికుమార్ యువజన విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాల ప్రముఖులు తీసుకొని వచ్చి  పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పాఠశాలకి సరైన వసతులు లేకుండా నడిపిస్తున్న యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. బహుళ అంతస్తు భవనం లో నడపబడుతున్న పాఠశాల విద్యార్థుల రక్షణ కోసం కనీసం గ్రిల్ కూడా ఏర్పాటు చేయలేదని ఎవరైనా విద్యార్థి పైన అంతస్తు నుంచి కింద పడితే ఎవరు వారి ప్రాణాలకి బాధ్యులు, ఈ విద్యాసంస్థ ప్రాణాలను తిరిగి తెస్తుందా అంటూ మండిపడ్డారు. స్కూలు అనుమతులపై పలు అనుమానాలు ఉన్నాయని, స్కూల్ పేరు కూడా పర్మిషన్ లో ఒకటి ఉంటే బోర్డుపై మరొకటి ఉంది అంటూ ఆరోపించారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Views: 124

About The Author

Post Comment

Comment List

Latest News